
WhatsApp డెస్క్‌టాప్ యాప్‌లో వ్యక్తిగతమైన, సురక్షితమైన వన్-టు-వన్ వాయిస్ ఇంకా వీడియో కాల్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని అనౌన్స్ చేయడానికి మేము సంతోషిస్తున్నాము.

మా సేవా నిబంధనలు, గోప్యతా విధానాన్ని సమీక్షించవలసిందిగా మేము WhatsApp వినియోగదారులను ఎలా కోరతామనే దాని గురించి అప్‌డేట్ చేసిన ప్లాన్‌లను మేము ఈరోజు షేర్ చేస్తున్నాము. ఈ అప్‌డేట్ గురించి పెద్ద ఎత్తున అసత్య సమాచారం ప్రచారం జరిగిన సమస్యను మేము ఎదుర్కున్నాము, దీనికి సంబంధించి నెలకొన్న ఏవైనా గందరగోళాలను తొలగించడానికి మేము గట్టిగా కృషి చేయడం కొనసాగిస్తాము.

మా ఇటీవలి అప్‌డేట్ గురించి ఎంతగా గందరగోళం నెలకొందనే దాని గురించి మేము చాలా మంది ప్రజల నుండి తెలుసుకున్నాము. ఇందులో చాలా వరకు ఆందోళన కలిగించే అసత్య సమాచారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా సూత్రాలను అలాగే వాస్తవాలను అర్థం చేసుకునేలా సహాయపడాలనుకుంటున్నాము.