కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండికమ్యూనిటీని రూపొందించండిమీ భావాలు వ్యక్తపరచండిబిజినెస్ కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
డౌన్‌లోడ్ చేయి
సేవా నిబంధనలు2023 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా మీ కస్టమర్‌లను రీచ్ అవ్వండి.

    • కమ్యూనిటీని రూపొందించండి

      గ్రూప్ సంభాషణలు సులభతరం చేయబడ్డాయి.

    • మీ భావాలు వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp Business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
WhatsApp Webడౌన్‌లోడ్
WhatsApp బ్లాగ్

డెస్క్‌టాప్ నుండి వ్యక్తిగతమైన, సురక్షితమైన కాలింగ్‌ను పరిచయం చేస్తున్నాం

WhatsApp డెస్క్‌టాప్ యాప్‌లో వ్యక్తిగతమైన అలాగే సురక్షితమైన వన్-టు-వన్ వాయిస్ ఇంకా వీడియో కాల్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని తెలపడానికి మేము సంతోషిస్తున్నాము.

గత సంవత్సరం, WhatsAppలో, వినియోగదారులు ఒకరికి ఒకరు కాల్ చేసుకోవడం, తరచుగా సుదీర్ఘ సంభాషణలను చేసుకోవడం అనేది పెరగడం మేము గమనించాము. గత నూతన సంవత్సర పండుగ నాడు, ఇంతకముందు ఎప్పుడూ లేనంత అధిక సంఖ్యలో వినియోగదారులు కాల్స్ చేసుకున్నారు. ఆ ఒక్క రోజులోనే 1.4 బిలియన్ల వాయిస్, వీడియో కాల్‌లను చేసుకున్నారు. ఇప్పటికీ చాలా మంది వినియోగదారులు తమకు ప్రియమైన వారికి దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకోవడం కోసం కొత్త మార్గాలను సర్దుబాటు చేసుకుంటున్నారు. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు మరియు ఏ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా WhatsAppలో జరిగే సంభాషణలు, వీలైనంత దగ్గరగా, స్వయంగా మాట్లాడుకుంటున్నట్లు అనిపించేలా చేయాలనుకుంటున్నాము.

పెద్ద స్క్రీన్‌పై జవాబివ్వడం ద్వారా సహా ఉద్యోగులతో పని చేయడాన్ని మరింత సులభంగా, మీ కుటుంబ సభ్యులను పెద్ద కాన్వాస్‌పై మరింత స్పష్టంగా చూడగలిగేలా చేస్తుంది, లేదా గదిలో తిరుగుతూ మాట్లాడుతూ మీ చేతులను ఖాళీగా ఉండేలా చేస్తుంది. డెస్క్‌టాప్ కాలింగ్‌ను మరింత ఉపయోగకరంగా మార్చేందుకు, పోర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్ రెండింటిలోనూ అది సులభంగా పనిచేసేలా జాగ్రత్త వహించాము, ఇది మీ కంప్యూటర్ స్క్రీన్‌పై రీసైజ్ చేసుకోగలిగే స్వతంత్ర విండోగా ఎల్లప్పుడూ అగ్రభాగంలో కనిపిస్తూ ఉంటుంది, కాబట్టి బ్రౌజర్ ట్యాబ్ లేదా తెరిచిన విండో అంచుల ఎగువ భాగంలో మీ వీడియో చాట్‌లను మీరు ఎప్పటికీ కోల్పోవడం జరగదు.

మీరు మీ ఫోన్ లేదా మీ కంప్యూటర్ నుండి కాల్ చేసినా WhatsAppలో వాయిస్ మరియు వీడియో కాల్‌లనేవి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేసి ఉంటాయి, కాబట్టి WhatsApp వాటిని వినడం లేదా చూడటం సాధ్యపడదు. మేము, WhatsApp డెస్క్‌టాప్ యాప్‌లో వన్-టు-వన్ కాల్‌లను ప్రారంభిస్తున్నాము. దీని వలన, మీకు నమ్మదగిన మరియు హై-క్వాలిటీ అనుభవం కలుగుతుందని మేము భావిస్తున్నాము. భవిష్యత్తులో మేము ఈ ఫీచర్‌ను విస్తరించి, గ్రూప్ వాయిస్ మరియు వీడియో కాల్‌లలో చేర్చుతాము.

వినియోగదారులు, తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వ్యక్తిగత, సురక్షితమైన డెస్క్‌టాప్ కాలింగ్‌ను ఆస్వాదిస్తారని మేము ఆశిస్తున్నాము. Windows PC మరియు Macలో డెస్క్‌టాప్ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలనే దానితో పాటు మరిన్ని విషయాలను మీరు ఇక్కడ చదవవచ్చు.

మార్చి 4, 2021

ట్వీట్షేర్ చేయండి
డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగోడౌన్‌లోడ్
మేము ఏమి చేస్తాముఫీచర్‌లుబ్లాగ్స్టోరీలుబిజినెస్ కోసం
మేము ఎవరుమా గురించిన సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండిAndroidiPhoneMac/PCWhatsapp Web
సహాయం కావాలా?మమ్మల్ని సంప్రదించండిసహాయ కేంద్రంకరోనావైరస్
డౌన్‌లోడ్

2023 © WhatsApp LLC

సేవా నిబంధనలు