ఫీచర్‌లు
కాలింగ్మెసేజింగ్గ్రూప్‌లుఛానల్‌లుMeta AIస్టేటస్భద్రతతల్లిదండ్రుల నియంత్రణలు
గోప్యతబ్లాగ్యాప్‌లుసహాయ కేంద్రంవ్యాపారం కోసం
లాగిన్ చేయండి
డౌన్‌లోడ్ చేయండి
డౌన్‌లోడ్
బ్లాగ్‌కు తిరిగి వెళ్లు
WhatsApp బ్లాగ్

డెస్క్‌టాప్ నుండి వ్యక్తిగతమైన, సురక్షితమైన కాలింగ్‌ను పరిచయం చేస్తున్నాము

WhatsApp డెస్క్‌టాప్ యాప్‌లో వ్యక్తిగతమైన, సురక్షితమైన వన్-టు-వన్ వాయిస్ ఇంకా వీడియో కాల్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని అనౌన్స్ చేయడానికి మేము సంతోషిస్తున్నాము.

గత సంవత్సరం, WhatsAppలో, వినియోగదారులు ఒకరికి ఒకరు కాల్ చేసుకోవడం, తరచుగా సుదీర్ఘ సంభాషణలను చేసుకోవడం అనేది పెరగడం మేము గమనించాము. గత నూతన సంవత్సర పండుగ నాడు, ఇంతకముందు ఎప్పుడూ లేనంత అధిక సంఖ్యలో వినియోగదారులు కాల్స్ చేసుకున్నారు. ఆ ఒక్క రోజులోనే 1.4 బిలియన్ల వాయిస్, వీడియో కాల్‌లను చేసుకున్నారు. ఇప్పటికీ చాలా మంది వినియోగదారులు తమకు ప్రియమైన వారికి దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకోవడం కోసం కొత్త మార్గాలను సర్దుబాటు చేసుకుంటున్నారు. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు మరియు ఏ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా WhatsAppలో జరిగే సంభాషణలు, వీలైనంత దగ్గరగా, స్వయంగా మాట్లాడుకుంటున్నట్లు అనిపించేలా చేయాలనుకుంటున్నాము.

పెద్ద స్క్రీన్‌పై జవాబివ్వడం ద్వారా సహా ఉద్యోగులతో పని చేయడాన్ని మరింత సులభంగా, మీ కుటుంబ సభ్యులను పెద్ద కాన్వాస్‌పై మరింత స్పష్టంగా చూడగలిగేలా చేస్తుంది, లేదా గదిలో తిరుగుతూ మాట్లాడుతూ మీ చేతులను ఖాళీగా ఉండేలా చేస్తుంది. డెస్క్‌టాప్ కాలింగ్‌ను మరింత ఉపయోగకరంగా మార్చేందుకు, పోర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్ రెండింటిలోనూ అది సులభంగా పనిచేసేలా జాగ్రత్త వహించాము, ఇది మీ కంప్యూటర్ స్క్రీన్‌పై రీసైజ్ చేసుకోగలిగే స్వతంత్ర విండోగా ఎల్లప్పుడూ అగ్రభాగంలో కనిపిస్తూ ఉంటుంది, కాబట్టి బ్రౌజర్ ట్యాబ్ లేదా తెరిచిన విండో అంచుల ఎగువ భాగంలో మీ వీడియో చాట్‌లను మీరు ఎప్పటికీ కోల్పోవడం జరగదు.

మీరు మీ ఫోన్ లేదా మీ కంప్యూటర్ నుండి కాల్ చేసినా WhatsAppలో వాయిస్ మరియు వీడియో కాల్‌లనేవి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేసి ఉంటాయి, కాబట్టి WhatsApp వాటిని వినడం లేదా చూడటం సాధ్యపడదు. మేము, WhatsApp డెస్క్‌టాప్ యాప్‌లో వన్-టు-వన్ కాల్‌లను ప్రారంభిస్తున్నాము. దీని వలన, మీకు నమ్మదగిన మరియు హై-క్వాలిటీ అనుభవం కలుగుతుందని మేము భావిస్తున్నాము. భవిష్యత్తులో మేము ఈ ఫీచర్‌ను విస్తరించి, గ్రూప్ వాయిస్ మరియు వీడియో కాల్‌లలో చేర్చుతాము.

స్నేహితులు, కుటుంబ సభ్యులతో వ్యక్తిగతమైన, అలాగే సురక్షితమైన డెస్క్‌టాప్ కాలింగ్‌ను వ్యక్తులు ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము. Windows PC మరియు Macలలో డెస్క్‌టాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా అనే దానితో సహా మీరు మరింత చదవవచ్చు here.

4 మార్చి, 2021

డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్

మేము ఏమి చేస్తాము

  • ఫీచర్‌లు
  • బ్లాగ్
  • భద్రత
  • వ్యాపారం కోసం

మేము ఎవరు

  • మా సమాచారం
  • ఉద్యోగావకాశాలు
  • బ్రాండ్ సెంటర్
  • గోప్యత

WhatsAppను ఉపయోగించండి

  • మొబైల్
  • డెస్క్‌టాప్
  • టాబ్లెట్
  • WhatsApp Web

సహాయం కావాలా?

  • మమ్మల్ని సంప్రదించండి
  • సహాయ కేంద్రం
  • యాప్‌లు
  • భద్రతా సలహాలు
డౌన్‌లోడ్

2026 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానంసైట్‌మ్యాప్
  • తెలుగు
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • தமிழ்
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)