కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
  • యాప్‌లు
    • కాలింగ్మెసేజింగ్గ్రూప్‌లుస్టేటస్ఛానల్‌లుMeta AIభద్రత
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
డౌన్‌లోడ్ చేసుకోండి
నిబంధనలు & గోప్యతా విధానం2026 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • కాలింగ్

      వాయిస్ మరియు వీడియోతో కనెక్ట్ అయ్యి ఉండండి.

    • మెసేజింగ్

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మొదలైనవాటితో మీరు అనుకున్నది చెప్పండి.

    • గ్రూప్‌లు

      మీరు గ్రూప్‌లలో కనెక్ట్ కావడానికి అవసరమయ్యే మెసేజింగ్ ఫీచర్‌లు.

    • ఛానల్‌లు

      మీరు శ్రద్ధ వహించే అంశాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండండి.

    • Meta AI

      WhatsAppలో భద్రత మరియు గోప్యతతో ఏ విషయంలోనైనా సహాయం పొందండి.

    • స్టేటస్

      ఫోటోలు, వీడియోలు మరియు వాయిస్ నోట్‌లతో మీ రోజువారీ కార్యక్రమాలను షేర్ చేయండి.

    • భద్రత

      సురక్షితంగా ఉండటంలో మీకు సహాయపడే రక్షణ వలయాలు.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • బిజినెస్ కోసం
  • యాప్‌లు
లాగిన్ చేయండిడౌన్‌లోడ్ చేసుకోండి
బ్లాగ్‌కు తిరిగి వెళ్లు
WhatsApp బ్లాగ్

మా ఇటీవలి అప్‌డేట్ కోసం మరింత సమయం ఇస్తున్నాము

మా ఇటీవలి అప్‌డేట్ గురించి ఎంతగా గందరగోళం నెలకొందనే దాని గురించి మేము చాలా మంది ప్రజల నుండి తెలుసుకున్నాము. ఇందులో చాలా వరకు ఆందోళన కలిగించే అసత్య సమాచారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా సూత్రాలను అలాగే వాస్తవాలను అర్థం చేసుకునేలా సహాయపడాలనుకుంటున్నాము.

WhatsAppను ఈ సింపుల్ ఐడియా మీద రూపొందించడం జరిగింది: మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీరు ఏమి షేర్ చేసుకున్నా అది మీ మధ్యే ఉంటుంది. అంటే, మేము ఎల్లప్పుడూ మీ వ్యక్తిగత సంభాషణలను సంపూర్ణ గుప్తీకరణతో సంరక్షిస్తామని దాని అర్థం, కాబట్టి WhatsApp కానీ Facebook కానీ ఈ ప్రైవేట్ మెసేజ్‌లను చూడటం సాధ్యపడదు. ఇందుకోసమే మేము ఏ ఒక్కరి మెసేజ్‌లు లేదా కాల్స్‌ వివరాలను ఉంచుకోము. అలాగే మీరు షేర్ చేసుకునే లొకేషన్ వివరాలను చూడటం మాకు సాధ్యపడదు, అలాగే మేము Facebookతో మీ కాంటాక్ట్‌లను షేర్ చేయము.

ఈ అప్‌డేట్‌లతో, అందులో ఏదీ మార్చబడదు. బదులుగా, అప్‌డేట్ WhatsAppలో ఒక బిజినెస్ సంస్థకు మెసేజ్ పంపాల్సి వచ్చేలా కొత్త ఎంపికలను కలిగి ఉంటుంది, అలాగే మేము డేటాను సేకరించే మరియు ఉపయోగించే విధానం గురించి మరింత పారదర్శకతను అందిస్తుంది. WhatsAppలో ప్రస్తుతం అందరూ బిజినెస్ సంస్థల నుండి కొనుగోలు చేయకపోయినప్పటికీ, భవిష్యత్తులో మరింత మంది వ్యక్తులు వీటిని ఉపయోగించేందుకు ఎంచుకుంటారని, కనుక ఈ సేవల గురించి వ్యక్తులు తెలుసుకోవడం ముఖ్యమని మేము భావిస్తున్నాము. ఈ అప్‌డేట్ వలన Facebookతో మేము డేటాను షేర్ చేసుకునే సామర్థ్యం పెరగదు.

వినియోగదారులు ఈ నిబంధనలను సమీక్షించి ఆమోదించేందుకు మేము నిర్ణయించిన తేదీని మేము వెనక్కి తీసుకుంటున్నాము. ఏ ఒక్కరి ఖాతా ఫిబ్రవరి 8వ తేదీన సస్పెండ్ చేయబడటం లేదా తొలగించబడటం జరగదు. WhatsAppలో గోప్యత మరియు భద్రత ఎలా పనిచేస్తాయనే దాని గురించి నెలకొన్న అసత్య సమాచారం గురించి మరింత స్పష్టతనిచ్చేందుకు మేము ఇంకా మరింత చేయదలచుకున్నాము. ఆ తర్వాత, మే 15న కొత్త బిజినెస్ ఆప్షన్లు అమల్లోకి రాబోయే లోపు, వినియోగదారులు వారికి వీలైన సమయంలో క్రమంగా ఈ విధానాన్ని సమీక్షించాలని మేము వారిని కోరతాము.

WhatsApp ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులుకు సంపూర్ణ గుప్తీకరణను అందించేందుకు సహాయపడింది, ఈ భద్రతా పరిజ్ఞానాన్ని ఇప్పుడూ, అలాగే రాబోయే రోజుల్లోనూ రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ వదంతుల గురించి మమ్మల్ని సంప్రదించిన ప్రతి ఒక్కరికి, అలాగే వాస్తవాల గురించి ప్రచారం చేసి పుకార్లను నిలువరించేందుకు సహాయపడిన అందరికి మేము ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ప్రైవేట్‌గా కమ్యూనికేషన్ నిర్వహించుకోవడానికి WhatsAppను ఉత్తమ మార్గంగా తీర్చిదిద్దేందుకు మేము మా శాయశక్తులా కృషి చేయడాన్ని ఇక మీదటా కొనసాగిస్తాము.

జనవరి 15, 2021

డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి

మేము ఏమి చేస్తాము

ఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం

మేము ఎవరు

మా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత

WhatsAppని ఉపయోగించండి

AndroidiPhoneMac/PCWhatsApp Web

సహాయం కావాలా?

మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రంయాప్‌లుభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2026 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానంసైట్‌మ్యాప్